ఉద్యోగం ఎక్కడ చెయ్యాలి?
నాకు హైదరాబాద్ నచ్చదు. ఆ ఫాస్ట్‌నెస్ నాకు నచ్చదు. ఆ పొల్యూషన్ అంతకంటే నచ్చదు. జాబ్ చెయ్యడం కోసం లోకల్ గా అంతంత దూరాలు ప్రయాణాలు చేయడం నచ్చదు. ఏదో ఉరుకులు పరుగులు పెడుతున్నట్టు ఉండడం అస్సలు నచ్చదు. నేను చదివిన చదువుకి నాకు దగ్గరలో(సొంత ఉరికి దగ్గరలో) ఒక పాతికవేలతో ఉద్యోగం వస్తుంది.
ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నా ఖర్చులు పోతే ఒక ఇరవై మిగలచ్చు .
నా ఇంట్లో వాళ్ళు నా స్నేహితులు అంతా నేను సిటీ కి రావాల్సిందే అని బలవంతం చేస్తున్నారు. అక్కడికి వస్తే ఇంకా మంచి పే (pay) వస్తుందని. రాను నాకిష్టం లేదు అంటే ఒక చేతకానివాడిలా చూస్తున్నారు. నాకు హైదరాబాద్ నచ్చదు. ఆ ఫాస్ట్‌నెస్ నాకు నచ్చదు. ఆ పొల్యూషన్ అంతకంటే నచ్చదు. జాబ్ చెయ్యడం కోసం లోకల్ గా అంతంత దూరాలు ప్రయాణాలు చేయడం నచ్చదు. ఏదో ఉరుకులు పరుగులు పెడుతున్నట్టు ఉండడం అస్సలు నచ్చదు. నేను చదివిన చదువుకి నాకు దగ్గరలో(సొంత ఉరికి దగ్గరలో) ఒక పాతికవేలతో ఉద్యోగం వస్తుంది.
ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నా ఖర్చులు పోతే ఒక ఇరవై మిగలచ్చు .
మొదటినుంచీ ఈ MNC లలో చెయ్యాలన్నా, సిటీ కల్చర్ కి అలవాటు పడాలన్నా అయిష్టత నాకు. ఎలాగోలా ఇబ్బంది పడుతూ చెయ్యగలను. ఒకసారి వెళితే అలవాటు పడగలను కానీ చెయ్యాలా??
ఉద్యోగం అంటే పెద్ద పెద్ద సిటీ లలో చేస్తే మాత్రమే చేసినట్టా? పెద్ద పెద్ద కంపెనీలలో చేస్తే మాత్రమే మనకు గుర్తింపు వస్తుందా? అసలు వాటిలోనే ఎందుకు చెయ్యాలి?
ఏం చెయ్యాలి నేను?
ఏం చెయ్యాలి నేను?