ఉద్యోగం ఎక్కడ చెయ్యాలి?
నాకు హైదరాబాద్ నచ్చదు. ఆ ఫాస్ట్‌నెస్ నాకు నచ్చదు. ఆ పొల్యూషన్ అంతకంటే నచ్చదు. జాబ్ చెయ్యడం కోసం లోకల్ గా అంతంత దూరాలు ప్రయాణాలు చేయడం నచ్చదు. ఏదో ఉరుకులు పరుగులు పెడుతున్నట్టు ఉండడం అస్సలు నచ్చదు. నేను చదివిన చదువుకి నాకు దగ్గరలో(సొంత ఉరికి దగ్గరలో) ఒక పాతికవేలతో ఉద్యోగం వస్తుంది.
ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నా ఖర్చులు పోతే ఒక ఇరవై మిగలచ్చు .
నా ఇంట్లో వాళ్ళు నా స్నేహితులు అంతా నేను సిటీ కి రావాల్సిందే అని బలవంతం చేస్తున్నారు. అక్కడికి వస్తే ఇంకా మంచి పే (pay) వస్తుందని. రాను నాకిష్టం లేదు అంటే ఒక చేతకానివాడిలా చూస్తున్నారు. నాకు హైదరాబాద్ నచ్చదు. ఆ ఫాస్ట్‌నెస్ నాకు నచ్చదు. ఆ పొల్యూషన్ అంతకంటే నచ్చదు. జాబ్ చెయ్యడం కోసం లోకల్ గా అంతంత దూరాలు ప్రయాణాలు చేయడం నచ్చదు. ఏదో ఉరుకులు పరుగులు పెడుతున్నట్టు ఉండడం అస్సలు నచ్చదు. నేను చదివిన చదువుకి నాకు దగ్గరలో(సొంత ఉరికి దగ్గరలో) ఒక పాతికవేలతో ఉద్యోగం వస్తుంది.
ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నా ఖర్చులు పోతే ఒక ఇరవై మిగలచ్చు .
మొదటినుంచీ ఈ MNC లలో చెయ్యాలన్నా, సిటీ కల్చర్ కి అలవాటు పడాలన్నా అయిష్టత నాకు. ఎలాగోలా ఇబ్బంది పడుతూ చెయ్యగలను. ఒకసారి వెళితే అలవాటు పడగలను కానీ చెయ్యాలా??
ఉద్యోగం అంటే పెద్ద పెద్ద సిటీ లలో చేస్తే మాత్రమే చేసినట్టా? పెద్ద పెద్ద కంపెనీలలో చేస్తే మాత్రమే మనకు గుర్తింపు వస్తుందా? అసలు వాటిలోనే ఎందుకు చెయ్యాలి?
ఏం చెయ్యాలి నేను?
ఏం చెయ్యాలి నేను?
మీ ఇష్ట ప్రకార౦ మీ ఊరికి దగ్గర్లో చేయడమే మ౦చిది. వేరేవారికోస౦ మీ ఇష్టాలని బలిచేయక౦డి. మీరు పెళ్ళి చేసుకోబోతున్నప్పుడు మీ కాబోయే శ్రీమతికి కూడా మీలా౦టి అభిరుచులే వు౦డేలా చూసుకో౦డి - లేకపోతే అప్పుటిను౦డీ మళ్ళీ సిటీల్లోనే బుక్కవుతారు!
ReplyDeleteమనం చేస్తున్న పని మనకి సంతృప్తి ని ఇస్తున్నంత వరకూ, ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చండి. కానీ నా స్వానుభవం మీద చెప్తున్నాను, పరిస్థితులు ఎప్పటికప్పుడు ఎలా మారుతూ ఉంటాయో, మన అభిప్రాయాలూ మారుతుంటాయి. కొన్నేళ్ళ తరువాత, మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పు అని అనిపిస్తే కొంచం ఇబ్బందే మరి. మనం ఎక్కడున్నా మనల్ని మనం ఆహ్లాదకరం గా ఉంచుకోవడం లో వుంది. All the best!!
ReplyDeleteపోనీ బేంగళూరులో చెయ్, లేదా ఢిల్లీ కెళ్ళు. కేదార్నాథ్ , అమర్నాథ్ వెళ్ళినా జనాల పీడ తప్పదు. గంగోత్రి దగ్గర ఏదైనా సాఫ్ట్వేర్ వుద్యోగం దొరికితే కాస్త బెటర్.
ReplyDeleteసిటీ రొదయే సౌఖ్యమనే భావన రానీవోయ్
ఆ ఎరుకే నిశ్చలానందమోయ్, బ్రహ్మానందమోయ్
మీరు సిటీలలో ఇంతకంటే కొంచెం ఎక్కువ సంపాదించినా మిగిలేది ఇంతే ఉంటుందండి. మీ ఊర్లో ఉన్న జాబ్ మీకు నచ్చితే మీరు హాయిగా అక్కడే ఉండిపోండి .శరత్ గారు అన్నట్టు మీ భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త :)
ReplyDeleteమనసు ప్రశాంతంగా ఉంటే ఆయుష్షు,ఆరోగ్యం బాగుంటాయి .ఎందుకొచ్చిన ఉరుకులపరుగులజీవితం ? యంత్రంలా పరిగెత్తిపరిగెత్తి పాలుతాగేకంటే నిలుచుని నీళ్ళుతాగటం ్ మంచిది.
ReplyDelete