Thursday, June 10, 2010

పెళ్ళిళ్ళు

మాకు తెలిసిన వాళ్ళ కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. ఈ మధ్య ఆడపిల్లలకి డిమాండ్ ఎక్కువైపోవడం తో ఆడపిల్లలే దొరకడం లేదు.
సరే నేను ఒక సంబంధం చూశాను. నెట్ లో. పిల్ల C.A చదువుకుంది. ఆమె తండ్రి కూడా C.A నే. ఆ అమ్మాయి ఒక పెద్ద ఫర్మ్ లో ప్రాక్టిసు. చేస్తోంది బానే ఉంది. ఆ అమ్మాయికి కాబోయే వరుడు సేమ్ కాస్ట్ లో 27 సంవత్సరాల వయసులో ఉండి అతను కూడా C.A అయి ఉంది ఉండాలి ట. వాడు కూడా వస్తే చక్కగా అందరూ కలిసి ప్రాక్టీసు పెట్టుకుంటారు కాబోలు. పుట్టే పిల్లలని కూడా C.A చదివిస్తారేమో. ఈ పెళ్ళిళ్ళు నిజంగానే మనుషులకి మనుషులకి జరిగెవెనా లేకపోతే వాళ్ళ చదువుకీ వీళ్ళ చదువుకీ జరిగేవా?
చూడబోతే అన్ని చోట్లా అలాగే జరుగుతునట్టు ఉన్నాయి. . మొన్నే ఇంకో పెళ్ళికి వెళ్ళి వచ్చాను. పెళ్లికొడుకు ఒక్కగానొక్క మనవడు. తండ్రి లేడు. తాతయ్యే చాలా ముద్దు గా పెంచాడు. కోటీశ్వరుడు . ఆయనకి ఎన్ని భూములూ ఎన్ని ఇళ్ళూ ఉన్నాయో ఆయనకే లెక్కతెలియదు. సరే ఆయన మానవాడిని దూరం గా ఉంచి చదివించాడు. ఇప్పుడు ఒక పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఎలాంటి సంబంధమో తెలుసా? ఆ పిల్ల తండ్రికి ఓ సిటీ లో నాలుగు సినిమా హాళ్లు ఉన్నాయి. ఆయనకి ఎన్ని ఇల్లు ఎన్ని పొలాలు ఉనాయో ఆయనకీ లెక్కతెలీదు. ఇలా ఉందనమాట పరిస్తితి. ఇక కట్నం గురించి చెప్పాలా 4 కోట్లు. అదన్న మాట సంగతి. ఆ పిల్ల ఆస్తికీ ఈ పీల్లోడి ఆస్తికీ పెళ్లన్న మాట.

తెలుసుకున్నపుడు అదోలా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు. ఇప్పుడన్నీ ఇలాగే జరుగుతున్నాయి లే అని సరిపెట్టేస్కోలేక ఏదో ఇక్కడ రాస్తే బెటర్ అనిపించి రాసేసా.

2 comments:

  1. మీరు చెప్పింది నిజమే! ఇప్పుడు చాలా పెళ్లి సంబంధాలు ఇలానే చూస్కుంటున్నారు. కలిసి వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు చర్చించుకునే విషయాలే వీళ్ళూ మాట్లాడుకుని డీల్ ఓకే అనుకుంటున్నారు. ;-)
    అన్నట్టు, మీ పేరు చాలా బాగుంది. అనుదీప్ :-) యండమూరి నవల సినిమాగా వచ్చిన 'ముత్యమంత ముద్దు' లో హీరో పేరు అనుదీప్. అది గుర్తొచ్చింది. మీ బ్లాగ్ చూడగానే! Nice template too :-)

    ReplyDelete
  2. మధురవాణి గారికి కామెంట్ రాసినందుకు చాలా థాంక్స్.
    నిజమే వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు అనుకున్నట్టే వీళ్ళూ చర్చించుకొని డన్ అనుకుంటున్నారు. వారి మధ్య సంబంధాలు వ్యాపార సంబంధాలుగా మారకుండా ఉంటే అదే చాలు.

    ReplyDelete