Wednesday, August 12, 2009

మా మంచి బ్లాగులు

ఈ బ్లాగులు నిజంగా గొప్పవే సుమండీ. నా ఫీలింగ్స్ ని షేర్ చేసుకోడానికి పెద్దగా స్నేహితులు లేక బాధ పడే వాడిని. ఉన్నా అన్నీ షేర్ చేసుకోలేం. కానీ ఆ అవసరాన్ని ఈ బ్లాగులు ఆ అవసరాన్ని తీరుస్తున్నాయి.
ఇక్కడ మనకంటే అనుభవజ్ఞులు మనం చెప్పే విషయాలు వింటారు. అవసరమైతే సలహాలిస్తారు. లేదా వాళ్ళు కూడా తమ అనుభవాలని ఆలోచనలని మనతో పంచుకుంటారు.

మనకేమైనా బాధ కలిగినా ఆనందం కలిగినా నలుగురితో పంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి.
సామెత తెలిసిందే కదా బాధ నలుగురితో పంచుకుంటే తగ్గుతుంది ఆనందం ఐతే రెట్టింపు అవుతుంది అని.

కరక్టే కదా.

Tuesday, August 11, 2009

నాకు హిజ్రా లంటే వళ్ళు మంట.

నాకు హిజ్రా లంటే వళ్ళు మంట.
ఏదో ఒక్క ఇన్సిడెంట్ తో అందర్నీ ఒక గాటన కట్టేయడం కాదు. అందర్నీ కూడా అనడం లేదు. ఈ దౌర్జన్యం గా అడుక్కునే హిజ్రా లంటే నే నాకు వాళ్ళు మంట. ఎందుకంటారా నా అనుభవాలు వినండి.
ఒక సారి నేను విజయవాడ రోడ్డు లో నడుస్తుండగా ఒక హిజ్ర నా దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వమని గొడవ చేసింది. సరే ఎందుకు గొడవ అని నేను ఒక రూపాయి ఇవ్వబోతే తీసుకోలేదు. నన్ను గొడవ చేయడం ప్రారంభించి పది రూపాయలిస్తే గానీ తీసుకోనని ఇబ్బంది పెట్టి చివరికి నా దగ్గర ఉన్న పదిహేను రూపాయలని లాక్కుని పోయింది. నేను basical గా కొంత షై. ఎంత embarrassing గా ఫీల్ ఆయనో నాకే తెల్సు. నిజానికి ఆరోజు నా దగ్గర డబ్బులు కూడా ఎక్కువగా లేవు. చాలా తక్కువగా ఉన్నాయి. ఆ రోజు డబ్బులు సరిపోక ఇబ్బంది పడ్డాను కూడా.

మరో సారి ట్రేన్ లో వెళ్తున్నపుడు కూడా మరో హిజ్రా వచ్చి పక్కనే కూర్చుని అదో రకం పిలుపుతో పిలుస్తూ నా జేబు లోనుండి మరో పది రూపాయలు ఇచ్చే వరకూ వదల్లేదు. అసలు వీళ్ళంతా నాలా అమాయకం గా కనిపించే కుర్రాళ్ళ మీదే పడతారెందుకనో?

అసలు నాకు అవసరం లో ఉన్న ఎవరైనా ఎ పనీ చేసుకోలేని వాళ్ళకి తప్పించి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం ఉండదు. కానీ వీళ్లకోసం స్పెషల్ రిజర్వు ఒకటి క్రియేట్ చేసుకుందామని కూడా అనిపించింది.

ఈ మధ్యనే మరో సారి మళ్ళీ ట్రేన్ లోనే ఒక హిజ్రా వచ్చింది. నేను కోపం గా చూశాను. సరే ఎందుకు గొడవ అని ఒక రెండు రూపాయలు ఇవ్వబోతే నా చేతిలో ఉన్న మరో రెండు రూపాయలని కూడా లాక్కు ని వెళ్ళిపోయిందో లేదో
ఇంతలో అంతకు ముందే నన్ను ధర్మం అడిగిన ఒక ముసలామె వచ్చి నాతో ఏమందో తెల్సా?
ఎం వాళ్ళకైతే ఇస్తావా? మాకైతే ఇవ్వవా? ఎం వాళ్ళంటే ఇష్టమా మీకు? అని పెద్ద పెద్ద గా అరుస్తోంది. నాకేం చేయాలో అర్ధం కాలేదు.
తర్వాత ఆమెకి కుడా మరో రూపాయి ఇస్తే ఎలాగో వెళ్లిపోయింది.

హా భగవంతుడా. నేనేం చెయ్యను?
నా పక్కన ఉండే ఇతర passengers కూడా ఏమీ మాట్లాడరు ఏంటో?

Friday, August 7, 2009

సాక్షి

నిన్న సాక్షి పేపర్ వాడు ఎం రాసాడో చూశారా. బాబ్లీ ప్రోజెక్ట్‌లతో సహా అన్ని ప్రాజెక్టుల తో పై రాష్ట్రాలు ఆక్రమం గా నీటిని వాడుకోవడం అనేది బాబు హయాం లోనే ప్రారంభమైందని సాక్షి వాడు రిసర్చ్ చేసి మరీ కనుకున్నాడట. సరే వాళ్ళు వెధవలనే కదా మిమ్మలని ఎన్నుకున్నది. మరి ప్రతిపక్షాలని తప్పు పట్టడం తప్పించి మీరేం చేస్తున్నట్టో. అసలు ఈ సాక్షి పేపర్ గురించి మాట్లాడడం అనవసరమని నేను డిసైడ్ అయిపోయా.ఇక నుంచి నేను దీని గురించి అసలు మాట్లాడను .