Tuesday, August 11, 2009

నాకు హిజ్రా లంటే వళ్ళు మంట.

నాకు హిజ్రా లంటే వళ్ళు మంట.
ఏదో ఒక్క ఇన్సిడెంట్ తో అందర్నీ ఒక గాటన కట్టేయడం కాదు. అందర్నీ కూడా అనడం లేదు. ఈ దౌర్జన్యం గా అడుక్కునే హిజ్రా లంటే నే నాకు వాళ్ళు మంట. ఎందుకంటారా నా అనుభవాలు వినండి.
ఒక సారి నేను విజయవాడ రోడ్డు లో నడుస్తుండగా ఒక హిజ్ర నా దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వమని గొడవ చేసింది. సరే ఎందుకు గొడవ అని నేను ఒక రూపాయి ఇవ్వబోతే తీసుకోలేదు. నన్ను గొడవ చేయడం ప్రారంభించి పది రూపాయలిస్తే గానీ తీసుకోనని ఇబ్బంది పెట్టి చివరికి నా దగ్గర ఉన్న పదిహేను రూపాయలని లాక్కుని పోయింది. నేను basical గా కొంత షై. ఎంత embarrassing గా ఫీల్ ఆయనో నాకే తెల్సు. నిజానికి ఆరోజు నా దగ్గర డబ్బులు కూడా ఎక్కువగా లేవు. చాలా తక్కువగా ఉన్నాయి. ఆ రోజు డబ్బులు సరిపోక ఇబ్బంది పడ్డాను కూడా.

మరో సారి ట్రేన్ లో వెళ్తున్నపుడు కూడా మరో హిజ్రా వచ్చి పక్కనే కూర్చుని అదో రకం పిలుపుతో పిలుస్తూ నా జేబు లోనుండి మరో పది రూపాయలు ఇచ్చే వరకూ వదల్లేదు. అసలు వీళ్ళంతా నాలా అమాయకం గా కనిపించే కుర్రాళ్ళ మీదే పడతారెందుకనో?

అసలు నాకు అవసరం లో ఉన్న ఎవరైనా ఎ పనీ చేసుకోలేని వాళ్ళకి తప్పించి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం ఉండదు. కానీ వీళ్లకోసం స్పెషల్ రిజర్వు ఒకటి క్రియేట్ చేసుకుందామని కూడా అనిపించింది.

ఈ మధ్యనే మరో సారి మళ్ళీ ట్రేన్ లోనే ఒక హిజ్రా వచ్చింది. నేను కోపం గా చూశాను. సరే ఎందుకు గొడవ అని ఒక రెండు రూపాయలు ఇవ్వబోతే నా చేతిలో ఉన్న మరో రెండు రూపాయలని కూడా లాక్కు ని వెళ్ళిపోయిందో లేదో
ఇంతలో అంతకు ముందే నన్ను ధర్మం అడిగిన ఒక ముసలామె వచ్చి నాతో ఏమందో తెల్సా?
ఎం వాళ్ళకైతే ఇస్తావా? మాకైతే ఇవ్వవా? ఎం వాళ్ళంటే ఇష్టమా మీకు? అని పెద్ద పెద్ద గా అరుస్తోంది. నాకేం చేయాలో అర్ధం కాలేదు.
తర్వాత ఆమెకి కుడా మరో రూపాయి ఇస్తే ఎలాగో వెళ్లిపోయింది.

హా భగవంతుడా. నేనేం చెయ్యను?
నా పక్కన ఉండే ఇతర passengers కూడా ఏమీ మాట్లాడరు ఏంటో?

7 comments:

  1. nijame..........naaku vallante bhayame.............ento idi ...........vallaki rights antaaru gaani ..mana minimum rights gurinchi evaru pattinchukoru..............vallu antnae ..........abbo.............

    ReplyDelete
  2. what you told may be true but I dont think much to give them money because no one will give them work. They cant live in society along with us because vallani "chinna choopu choostaru". How many of the people are ready to give them work? Even if very few good people give them work, will the colleagues respect them and dont make comment on them. Forget about everyone, how many of parents are accepting them, many parents are afraid of the society and "vallani galiki vadilestaru"

    ReplyDelete
  3. ఈ మధ్య రైళ్ళలో వీళ్ళ బెడద చాలా ఎక్కువయింది.దౌర్జన్యానికి కూడా పాల్పడుతున్నారు.

    ReplyDelete
  4. బలవంతపు వసూళ్ళు అనేవి ఏ రకంగానయినవి అయినా సరే నిరోధించాల్సిందే.
    ఆ అడుక్కుతినే ముసలమ్మ ఉక్రోషం సరి అయినదే.

    ReplyDelete
  5. @kumar

    మీరు చెప్పింది తప్పు అనను, కాని మన సమాజం లో హిజ్రాలు చాలా తక్కువ 80 శాతం వెషాలు వేసుకొని దౌర్జన్యం చెసేవాళ్ళె.

    @చిలమకూరు విజయమోహన్
    అవునండి,పోయిన వారం అనంతపురం రైల్వే స్టేషను లో ఒక అమ్మాయి తో అసభ్యంగా ప్రవర్తించారు,నేను నా స్నెహితులు కలసి చితకబాదాం,తీరా చుస్తే వాళ్ళు హిజ్రాలు కారు,హిజ్రా గా వేషాలు వేసుకొని వచ్చారు.

    ReplyDelete
  6. నాకు వాళ్ళంటే భయం, కోపం కూడా... రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు అనిపిస్తుంది అందరూ కలసి వీళ్ళని ఎదిరించవచ్చు కదా! అని.

    ReplyDelete
  7. same to 'shame' feelings !

    ReplyDelete